పాణ్యం బస్టాండు అభివృద్ధి శూన్యం నిధులు కేటాయించి మరమ్మతులు చేపట్టాలి....

Malledastagiri avatar   
Malledastagiri
పాణ్యం బస్టాండ్ అభివృద్ధి సూన్యం. పాణ్యం మండలం 22 నవంబరు 2022 పాణ్యం మండలం లో పేరుకు మాత్రమే బస్టాండ్ బస్టాండ్ ఏర్పడి దాదాపు గా 30 సంవత్సరాలనుండి ఎలాంటి అభివృద్ధి కి నోచు....

పాణ్యం బస్టాండ్ అభివృద్ధి సూన్యం .... పాణ్యం మండలం 22 నవంబరు 2022 పాణ్యం మండలం లో పేరుకు మాత్రమే బస్టాండ్ బస్టాండ్ ఏర్పడి దాదాపు గా 30 సంవత్సరాలనుండి ఎలాంటి అభివృద్ధి కి నోచుకోలేదు ప్రజలు చుట్టూ ప్రక్కల ప్రజలు నిత్యం వందల మంది ప్రయాణికులు వస్తుంటారు గతం లో ఉన్న బస్టాండ్ ను తొలగించి నేషనల్ హైవే బస్టాండ్ మీదుగా వెళ్లినందున కిడ్కో వారు చిన్న బస్టాండ్ ఏర్పాటు చేసి అందులో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వనం వెంకటాద్రి మాట్లాడుతూ గతంలో బస్టాండ్ కొరకు R&B వారు ఒక ఎకరా స్థలం కేటాంచారు ఇప్పుడు ఆ బస్టాండ్ చిన్నది గా కట్టి మిగతా స్థలం బాడుగలకు కేటాయించి ప్రజలకు త్రాగునీరు మహిళలకు మరుగుదొడ్లు విద్యార్థులకు, బస్సు పాస్ కౌంటర్ లు ఏర్పాటు చేయాలని వారు మాట్లాడుతూ గతంలో ఎన్నోసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు తెలియజేసిన ఏ అధికారి కూడా ఈ యొక్క బస్టాండ్ పైన స్పందించకపోవడంతో వచ్చే వారంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ ను విద్యార్థి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ముట్టడిస్తామని వారు మాట్లాడుతూ ఈ యొక్క బస్టాండు ఆవరణంలో షాపులు కేటాయించి వారి నుండి వేలకు వేలు పోగేసుకొని ప్రజలకు సౌకర్యాలు కల్పించకుండా అధికారులు తూతూ మంత్రంగా స్పందిస్తూ పోతున్నారు. రాబోయే రోజులలో ఈ యొక్క బస్టాండును పెద్దగా ఏర్పాటు చేసుకొని ఈ డిపో బస్సు అయినా ఆగేటట్లు చూసి షాపులు తొలగించి ప్రజలకు సౌకర్యంగా ఉండేలా చూడాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు బత్తిని ప్రతాప్, మండల నాయకులు బాలకృష్ణ నాయక్ పాల్గొన్నారు.

No comments found