watermark logo

జవహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్

6 Views· 26/12/22
India Mirror
India Mirror
153 Subscribers
153
In News

*జవహార్ నగర్ చెత్త డంపింగ్ యార్డు బాధిత 2వ డివిజన్ పరిధిలోని కార్మిక నగర్ కు అక్కడి సమస్యలపై స్థానిక బిజెపి కార్యకర్తలతో చర్చించడానికి.. తెలంగాణ బిజెపి మాజీ ఉపాధ్యక్షులు, సీనియర్ నాయకులు శ్రీ కొంపెల్లి మోహన్ రెడ్డి అన్నగారు కార్మిక నగర్ రావడం జరిగింది.*

*అక్కడి సమస్యలను స్థానిక కాలనీవాసులు మరియు స్థానిక బిజెపి నాయకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాంకీ సంస్థ ప్రతినిధులకు ఫోన్ చేసి ప్రత్యక్షంగా జవహర్ నగర్ చెత్త డంపింగ్ యార్డు వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గబ్బిలాల పేట్, అంబేద్కర్ నగర్, కార్మిక నగర్, వైఎస్ఆర్ నగర్, శాంతినగర్ కాలనీలలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు తీర్పును అనుసరించి అక్కడ నివసించే ప్రజల మౌలిక సదుపాయాల కల్పనలో రాంకీ యాజమాన్యం నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం మరియు రాంకీ సంస్థ వెంటనే స్పందించి చెత్త దుర్వాసన వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న కాలనీలలో వెంటనే బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని, ప్రత్యేకంగా మంచినీటి వాటర్ ప్లాంట్ లు ఏర్పాటు చేయాలని, అంగన్వాడీ లతోపాటు పాఠశాలలు ఏర్పాటు చేయాలని ఎలాంటి అభివృద్ధికి నోచుకోక అస్తవ్యస్తంగా ఉన్న కాలనీలో సీసీ రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తూ.. లేని పక్షంలో బాధిత ప్రజలకు మద్దతుగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా రాంకీ యాజమాన్యం అధికార టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.*

_మరియు.._

*ఈరోజు 25 - డిసెంబర్.. మాజీ భారత ప్రధాని, భారత రత్న, మాన్యశ్రీ అటల్ బిహారి వాజ్‌ పాయి గారి జన్మదిన శుభ సందర్భంగా.. బిజెపి కార్మిక నగర్ శాఖ నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ మహానుభావుని చిత్రపటానికి పూలమాలతో నమస్సుమాంజలులు అర్పించడం జరిగింది. ఈసందర్భంగా కార్మిక నగర్ కు చెందిన పలువురు నాయకులు, యువకులు యాడికి వెంకటరమణ, సుధాకర్, తాళ్లపల్లి కృష్ణ, రంగస్వామి, భగత్ సింగ్, రంగయ్య రాజు, గుంట బాలు, గుంట శ్రీను, కొండయ్య, బి నరేష్ హరిదాప బీజేపీ పార్టీ లో చేరారు. వీరిని శ్రీ కొంపల్లి మోహన్ రెడ్డి అన్న గారు బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.*

*ఈ కార్యక్రమంలో జవహార్ నగర్ లోని బీజేపీ మరియు వివిధ మోర్చాలలో వివిధ స్థాయిల్లో బాధ్యతలు కలిగిన నాయకులు, కార్యకర్తలతో పాటు స్థానిక బిజెపి కార్మిక నగర్ శాఖ నాయకులు నరసాపురం కృష్ణయ్య, గజం శ్రీనివాస్, శనిగరం కనకయ్య, మద్యబోయిన రాజు, యాటకారి శ్రీనివాస్, తప్ప మల్లికార్జున్ రెడ్డి, ఇర్మియ, శ్రీనివాస్ చారి, ఉపేంద్రా చారి, శ్రీనివాస్ చారి, పప్పుల మల్సూర్, వీరాచారి, సిద్ధులు, రమణ, రాజేందర్, భూపతి, గణేష్, విక్రమ్, అబ్దుల్ నవి, ఎండి అజ్మత్, మేకల స్వామి తదితరులు పాల్గొన్నారు.*


*ఇట్లు*
*రంగుల శంకర్ నేత,*
*అధ్యక్షులు - బిజెపి,*
*జవహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్.*

Show more

 0 Comments sort   Sort By