watermark logo

జవహార్ నగర్ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ లో..

5 Views· 05/12/22
India Mirror
India Mirror
153 Subscribers
153
In News

తెలంగాణ ప్రభుత్వం 'మిషన్ భగీరథ' పేరుతో అధిక నల్లా బిల్లుల వసూళ్లు, అధిక నల్లా కనెక్షన్ ల వసూళ్లు..*
*వెలుగులోకి వచ్చిన చేదు నిజాలు..*

👉 _*మిషన్ భగీరథ నీటి పేరుతో జవహర్ నగర్ లో ప్రజల రక్తం తాగుతూ నిలువు దోపిడీ చేస్తున్న HMWSSB అధికారులు..*_

👉 _*జవహర్ నగర్ లో మిషన్ భగీరథ నల్ల బిల్లులు కట్టకపోతే పోలీసులను పిలిపించి మరి నల్ల కలెక్షన్లు కట్ చేస్తామని భయభ్రాంతులకు గురిచేస్తున్న HMWSSB అధికారులు..*_

👉 _*మిషన్ భగీరథ అంతా ఒక డ్రామా..*_
💥💥💥💥💥💥💥

*జవహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక చెత్త డంపింగ్ యార్డ్ బాదిత ప్రాంతం ఇక్కడ చాలా కుటుంబాలు చిన్న చిన్న పనులు చేసుకుంటూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.*

*తెలంగాణ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకునే మిషన్ భగీరథ పథకం ద్వారా జవహార్ నగర్ లో రూపాయికే నల్లా కనెక్షన్ అని ప్రారంభించి.. కొత్త నల్లా కనెక్షన్ కు దాదాపు 900 రూపాయలు తీసుకున్నారు. కనెక్షన్ ఇచ్చేటప్పుడు దాదాపు 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది కాకుండా బాధాకరమైన విషయం ఏమిటంటే జవహర్ నగర్ లో నల్లా కనెక్షన్ ఇచ్చే ఇంటి కొలతలు తీసుకొని 200 గజాలు ఉంటే దాదాపు పదివేలపైన 300 గజాలు ఉంటే 15 వేల దాకా డబ్బులు తీసుకొని నల్ల కలెక్షన్ ఇవ్వటం బాధాకరం.*

*జవహర్ నగర్ లో నివసించేవారు బడుగు బలహీన వర్గాలకు చెందినవారు మరియు డంపింగ్ యార్డ్ బాధితులం ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నందున ఒక కుటుంబం 300 గజాల స్థలం ఉంటే 15వ వేల వరకు చెల్లించి నల్ల కలెక్షన్ తీసుకోవడం ఇది చాలా బాధాకరం తెలంగాణలో ఉచిత వాటర్ కనెక్షన్ అని చెప్పి జవహర్ నగర్ పేదల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం.*

*జవహర్ నగర్ లో మిషన్ భగీరథ కనెక్షన్లు పాతవి ఉన్నవాళ్లకి ఇచ్చి దాదాపు 6,7 నెలలు గడుస్తుంది కానీ బిల్లులు మాత్రం దాదాపు రెండు సంవత్సరాల బిల్లులు వసూలు చేస్తున్నారు.*

*ఇంతకుముందు గ్రామపంచాయతీ ఉన్నప్పుడు నెలకు 100 రూపాలు నల్లా బిల్లు కట్టేవాళ్ళు కానీ మిషన్ భగీరథ వచ్చినాక నెలకు 250 రూపాయలు తీసుకుంటున్నారు. అయినా పర్వాలేదు కడతాము కానీ కనెక్షన్ ఇచ్చిన ఆరు నెలల గడుస్తుంది కానీ రెండు సంవత్సరాల నల్లా బిల్లు వసూలు చేయడం అంటే ఇది తెలంగాణాలో నీళ్ల పేరుతో జరిగే దోపిడీ, కావున ఆరు నెలల నల్లా కలెక్షన్ బిల్లులు అనగా 1000 నుంచి 1500 లేదా 2000 తీసుకోవాలని మేము బిజెపి పార్టీ నుంచి ప్రజల పక్షాన తెలియజేస్తున్నాం.*

*పేద ప్రజల రక్తం తాగే విధంగా అధిక బిల్లులు వసూలు చేయవద్దని బిజెపి పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. లేనిచో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో బాధితులు, ప్రజల పక్షాన HMWSSB ఆఫీస్ ముందు ధర్నా చేస్తాము.*


*ఇట్లు*
*రంగుల శంకర్ నేత,*
*అధ్యక్షులు - బిజెపి,*
*జవహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్.*

Show more

 0 Comments sort   Sort By