watermark logo

ఈరోజు ఉదయం జవహార్ నగర్ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో

15 Views· 20/11/22
India Mirror
India Mirror
153 Subscribers
153

⁣*ఈరోజు ఉదయం జవహార్ నగర్ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో..*

*ఈరోజు పలు డివిజన్ లలో మంత్రి మల్లారెడ్డి పర్యటనను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి మంత్రి మల్లారెడ్డి, జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య మరియు డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ ల దిష్టిబొమ్మలు జవహర్ నగర్ ఎంట్రెన్స్ కమాన్ వద్ద దహనం చేయడం జరిగింది.*

*మంత్రి మల్లారెడ్డి జవహార్ నగర్ లో ఈరోజు కొన్ని డివిజన్ లలో పర్యటిస్తుండడం చాలా బాధాకరం. 8 సంవత్సరాలుగా మేడ్చల్ జిల్లా జవహార్ నగర్ ను పరిపాలిస్తూ శిలా ఫలకాలకే పరిమితమైన మంత్రి మల్లారెడ్డి, మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ కూడా జవహర్ నగర్ లో మూడు సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి చేయకుండా కేవలం శిలాఫలకాలకే పరిమితమయ్యారు.*

*అయ్యా మంత్రి మల్లారెడ్డి గారు జవహర్ నగర్ లో పర్యటించే ముందు మీరు జవహర్ నగర్ కి ఏమి చేశారో ఒక్క సారి ఆలోచన చెయ్యాలె..!?*

*రెండు సంవత్సరాల క్రితం జవహార్ నగర్ లో 100 ఫీట్ల రోడ్డు వేస్తానని శిలాఫలకం వేశారు, జవహార్ నగర్ లో పార్కు కోసం శిలాఫలకం వేశారు, మార్కెట్ యార్డ్ కోసం శిలాఫలకం వేశారు, హెర్బల్ వనమూలికల పార్కు చేస్తానని శిలాఫలకం వేశారు, కొత్తగా నాన్ వెజ్ మార్కెట్ కోసం శిలాఫలకం వేశారు..*

*గత 8 సంవత్సరాల క్రితం ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం జవహార్ నగర్ లో 58, 59 జీవో పేరుతో సామాన్య ప్రజల నుండి దాదాపు ఏడు కోట్ల రూపాయలు వసూలు చేశారు అయినా ఇంతవరకు 58,59 జీవో అమలు కాలేదు.*

*చెన్నాపురం చెరువు పరిస్థితి ఘోరంగా ఉంది.. ఇప్పటివరకు వందల సంఖ్యలో మనుషులు అందులో పడి చనిపోయినా ఎలాంటి జాగ్రత్త చర్యలు లేవు. కనీసం దానికి ఫెన్సింగ్, లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు లేదు.*

*మిషన్ భగీరథ పేరుతో ఉచిత వాటర్ కనెక్షన్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కొత్త వాటర్ కనెక్షన్ కు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు.*

*జవహార్ నగర్ లో 8 సంవత్సరాల నుంచి ఒక ఎంపీ లాగా మరియు ఒక మంత్రి లాగా జవహర్ నగర్ కు నువ్వు చేసిన అభివృద్ధి ఏందో చెప్పాలె మంత్రి మల్లారెడ్డి గారూ..*

*మీరు వేసిన శిలాఫలకాలు శిథిలమైపోతున్నాయి.. ఇప్పుడు మల్లా ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి కొత్తగా ప్రజలను మోసం చేస్తూ జవహర్ నగర్ నా గుండెకాయ అని, జవహర్ నగర్ ను దత్తత తీసుకుంటాను అని చెప్పి ప్రగల్భాలు పలకడమే తప్ప మీరు ప్రజలకు చేసింది ఏమీ లేదు అంతా శూన్యం.*


*ఈకార్యక్రమంలో జవహార్ నగర్ లోని బిజెపి మరియు వివిధ మోర్చాలలో వివిధ స్థాయిల్లో బాధ్యతలు కలిగిన నాయకులు బల్లి చంద్రమౌళి, కమల్, మల్లేష్ గౌడ్, రామ్ నాయక్, మహేష్ గౌడ్, వేపుల సన్నీ, సునీల్ నేత, ఈర్ల అనిల్, సంగ గణేష్, రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రశాంత్, రాహుల్ సింగ్, మల్లిగారి శ్రీనివాస్, ఓబుల్ రెడ్డి, లక్ష్మీ రెడ్డి, జంగం లక్ష్మి, తులసీ రామ్, మహేందర్ ముదిరాజ్, సాయిరాం, శ్రీనివాస్ గౌడ్, వెంకన్న, విజయ్, రమేష్, శివ శంకర్, అనిల్ నాని, ముచ్చర్ల యాదగిరి, బొమ్మ యాదగిరి, బుజ్జి, తేజ, సాయికుమార్, శ్రీనివాస్ చారి, మహేష్, రాజు నాయక్, నాయక్ రామ్, తదితరులు పాల్గొన్నారు.*


*ఇట్లు*
*రంగుల శంకర్ నేత,*
*అధ్యక్షులు - బిజెపి,*
*జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్.*

Show more

 0 Comments sort   Sort By