⁣ప్రభుత్వ నిధులు వినియోగంపై మురుపాక పాఠశాల తనిఖీ చేసిన సిసిఆర్ సంస్థ

252 Views· 19/12/22
Malledastagiri
Malledastagiri
1 Subscribers
1
In Other

12 డిసెంబర్2022
విద్యార్థుల విద్యా హక్కుల పరిరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల అభివృద్ధి కి మంజూరు చేసిన నిధులు కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ అనే మానవ హక్కుల సంస్థ సమాచార హక్కు చట్టం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో తనిఖీలు చేస్తున్నామని కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్(సిసిఆర్) జాతీయ కార్యదర్శి బత్తిన శ్రీనివాసరావు అన్నారు.. సోమవారం సిసిఆర్ సభ్యుడు, జి.బ్రహ్మేంద్ర సమాచార హక్కు చట్టం 2005 లో సెక్షన్ 2 J (1) పై చోడవరం నియోజకవర్గం మరుపాక ఏపీ మోడల్ స్కూల్ లో సమాచార హక్కు చట్టం ప్రకారం పాఠశాల అభివృద్ధి కోసం మంజూరు చేసిన నిధులు సక్రమంగా వినియోగం జరిగిందా లేదా అని వివిధ డాక్యుమెంట్ లు పరిశీలన చేశారు.. వివిధ బిల్లులు,రశీదులు,రికార్డులు సిసిఆర్ సభ్యులు అత్యంత పకడ్బందీగా పరిశీలన చేశారు.. ఈ సందర్భంగా సిసిఅర్ జాతీయ కార్యదర్శి బత్తిన శ్రీనివాసరావు మాట్లాడుతూ రికార్డుల పరిశీలన అనంతరం సిసిఆర్ దృష్టికి వచ్చిన పలు లోపాలు,అక్రమాలు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకుని వెళ్తామని పేర్కొన్నారు..కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాల అభివృద్ధి కోసం వెచ్చించిన ప్రతి పైసా విద్యార్థుల అభివృద్ధి కి ఖర్చు చెయ్యాలనేది మా సిసిఆర్ సంస్థ యొక్క లక్ష్యం అని అన్నారు..ఈ కార్యక్రమంలో సిసిఆర్ బి.చరణ్ కాంత్, సీహెచ్.రజేష్ కుమార్,జి.దేవరాజు,వి.రవీంద్ర బాబు, విశాఖ జిల్లా ప్రెస్ అండ్ మీడియా ఇంచార్జి కసిపల్లి శ్రీనివాసరావు, జి.సత్తిబాబు, జి.నానిబాబు, ఎస్.నాగేశ్వరరావు తదితరులు పాఠశాల తనిఖీలు లో పాల్గొన్నారు

Show more

 0 Comments sort   Sort By