పొటాటో చిప్స్ తింటున్నారా? అయితే.. క్యాన్స‌ర్ ప‌క్కా అంటున్న వైద్యులు!

Comments · 280 Views

చిన్న‌పిల్ల‌ల‌నుంచి పెద్ద‌ల‌వ‌ర‌కూ ఈ పొటాటో చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఫేవ‌నేట్ స్నాక్‌గా మారిపోయింది. అయితే,

చాలామందికి ఇప్పుడు చిప్స్ తిన‌డం ఒక అలవాటుగా మారిపోయింది. స్నాక్స్ టైంలో ఎక్కువ‌మంది పొటాటో చిప్స్ తినేందుకు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతున్నారు. చిన్న‌పిల్ల‌ల‌నుంచి పెద్ద‌ల‌వ‌ర‌కూ ఈ పొటాటో చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఫేవ‌నేట్ స్నాక్‌గా మారిపోయింది. అయితే, ఇలాంటి వారికి అమెరికా వైద్యులు ఓ చేదువార్త చెప్పారు. పొటాటో చిప్స్ తింటే క్యాన్స‌ర్ బారిన‌ప‌డే ప్ర‌మాదం ఉన్న‌ద‌ని తేల్చి చెప్పారు. ఏంటీ పొటాటో చిప్స్‌తో క్యాన్స‌ర్ ఎలా వ‌స్తుంద‌ని ఆలోచిస్తున్నారా? మ‌రి ఆ వైద్యులు చెప్పిన రీజ‌న్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పొటాటో చిప్స్‌ను అచ్చం ఆలుగ‌డ్డ‌ల‌తోనే త‌యారుచేయ‌రు. గోధుమ‌, బియ్యం,  కార్న్ పౌడ‌ర్‌, ఆలుగ‌డ్డ ఫ్లేక్స్‌ను ఒక్క‌చోట ముద్ద‌గా పిసికి ఓ స‌న్న‌ని షీట్‌పై ఈ ముద్ద‌ను ఉంచి చిప్స్ ఆకారంలో త‌యారుచేస్తారు. అవి చిప్స్‌గా మారేంత‌వ‌ర‌కూ క‌న్వేయ‌ర్ బెల్ట్‌పై తిప్పుతుంటారు. క‌ర్వ్ షేప్‌లో క‌ట్ చేసి అనంత‌రం స‌ల‌స‌ల కాగే నూనెలో వాటిని వేయిస్తారు. అనంత‌రం ప్రిజ‌ర్వేటివ్స్ క‌లిపి ప్యాక్ చేస్తారు. ఈ ప్ర‌క్రియ‌లో అందులో అక్రిల‌మైడ్ అనే విష‌పూరిత న్యూట్రోటాక్సిక్ కెమిక‌ల్ రిలీజ్ అవుతుంది. దీనివ‌ల్లే చిప్స్ రెగ్యుల‌ర్‌గా తినేవాళ్లో క్యాన్స‌ర్ వ‌స్తుంద‌ని వైద్యులు చెప్తున్నారు. 

అక్రిల‌మైడ్ అంత ప్ర‌మాద‌మా?
అక్రిల‌మైడ్ అనేది హానిక‌ర‌మైన‌, విష‌పూరిత‌మైన న్యూట్రోటాక్సిక్ కెమిక‌ల్‌. కార్బొహైడ్రేట్స్ ఎక్కువ‌గా ఉండే చిప్స్‌, ఫ్రెంచ్‌ఫ్రైస్‌ను 100 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్ర‌త ఉన్న నూనెలో వేయించిన‌ప్పుడు ఇది విడుద‌ల‌వుతుంది. అక్రిల‌మైడ్ వ‌ల్లే చిప్స్ ఉప‌రిత‌లం గోధుమ లేదా ప‌సుపురంగులోకి మారుతాయి. ఇది కార్సినోజెనిక్ ఏజెంట్ అంటే క్యాన్స‌ర్ కార‌కంగా ప‌నిచేస్తుంది. ఈ అక్రిల‌మైడ్‌తోపాటు చిప్స్‌లో ఉండే పాలిసైక్లిక్ ఎరోమాటిక్ హైడ్రోకార్బ‌న్స్‌, హెటిరో సైక్లిక్ అమైన్స్ కూడా క్యాన్స‌ర్ కార‌కాలుగా ప‌నిచేస్తాయి. 

 

Comments